విమాన ప్రమాదం: అంజూను మర్చిపోలేం.. షాక్‌కు గురైన సహ విద్యార్థులు | Copilot Anju Death in Plane Crash Tenali Friends Shocked | Sakshi
Sakshi News home page

Nepal Plane Crash: అంజూను మర్చిపోలేం.. షాక్‌కు గురైన సహ విద్యార్థులు

Published Wed, Jan 18 2023 11:55 AM | Last Updated on Wed, Jan 18 2023 12:23 PM

Copilot Anju Death in Plane Crash Tenali Friends Shocked - Sakshi

అంజూ (ఫైల్‌) 

సాక్షి, తెనాలి: నేపాల్‌లోని పొఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో కోపైలట్‌ అంజూ ఖతివాడ మరణించడంతో.. తెనాలిలోని ఆమె సహ విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. నేపాల్‌లోని విరాట్‌ నగర్‌కు చెందిన అంజూ 1995లో తెనాలిలోని వివేకానంద జూనియర్‌ కాలేజ్‌లో ఇంటర్‌ విద్యాభ్యాసం చేశారు. ఆ బ్యాచ్‌లో నేపాలీలు మొత్తం 125 మంది వరకు ఉన్నారని.. అందులో అంజూ అందరితో కలివిడిగా.. చదువులో చురుగ్గా ఉండేది.

బైపీసీలో 72 శాతం మార్కులు సాధించిందని.. వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా అందరితో టచ్‌లో ఉండేదని సహ విద్యార్థి లింగం మకుటం శివకుమార్‌ చెప్పారు. ఆమె భర్త కూడా పైలట్‌ అని.. ఓ విమాన ప్రమాదంలో మరణించారని పేర్కొన్నారు. బీమా డబ్బుతో అంజూ పైలట్‌ శిక్షణ తీసుకుందని చెప్పారు. 6,400 గంటలకు పైగా విమానం నడిపిన అంజూ ఇలా ప్రమాదంలో మరణించడాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. అంజూను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. కాగా, అంజూ మృతిపై వివేక విద్యాసంస్థల డైరెక్టర్‌ వీరనారాయణ సంతాపం తెలిపారు.

చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్‌ భార్య ఆత్మహత్య)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement