కాకినాడ: భారతీయ పర్వతారోహకుల్లో కాకినాడ మహిళలు మరో మైలురాయిని అధిగవిుంచారు. 19,341 అడుగుల ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని ఏడు రోజుల్లో అధిరోహించి.. పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.
పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న కాకినాడకు చెందిన సత్తి లక్ష్మితో పాటు కోనేరు అనిత, వాడకట్టు పద్మజ, స్రవంతి చేకూరి, శ్రీశ్యామలలు.. ఏడు రోజుల్లో వీరు లక్ష్యాన్ని చేరుకోవడంతో వీరి తెగువకు, సంకల్పానికి, కఠోర దీక్షకు అందరూ ఫిదా అవుతున్నారు.
వారం రోజులు శ్రమించి సరిగ్గా ఆగస్టు 15న కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. వీరిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కరరెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment