Sakshi News home page

నేటి రాశి ఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోభివృద్ధి

Published Fri, Mar 29 2024 6:47 AM

Daily Horoscope Telugu 29 March 2024 - Sakshi

మేషం... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

వృషభం... ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోభివృద్ధి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.

మిథునం... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం... రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

సింహం... వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

కన్య... ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల... వ్యవహారాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. నిరుద్యోగులకు ఒత్తిడులు. ధనవ్యయం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వృశ్చికం... ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు... సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

కుంభం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య సమాచారం రాగలదు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత చికాకులు.

Advertisement

What’s your opinion

Advertisement