
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.పాడ్యమి పూర్తి (24 గంటలు) తదుపరి విదియ, నక్షత్రం: స్వాతి రా.11.55 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.33 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: ప.2.15 నుండి 4.01 వరకు.
సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వాహనాలు కొంటారు.
వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కార్యజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం.
కర్కాటకం: కొన్ని పనులలో అవాంతరాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు స్వల్ప మార్పులు. మిత్రుల నుంచి ఒత్తిడులు.
సింహం: కార్యజయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కన్య: రుణాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.
తుల: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటì మిత్రుల నుంచి ఆహ్వానాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు సన్మానాలు.
వృశ్చికం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. కొన్ని పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు.
ధనుస్సు: విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అరుదైన సన్మానాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. వాహన, గృహయోగాలు.
కుంభం: కస్మిక ప్రయాణాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధుగణంతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు.
Comments
Please login to add a commentAdd a comment