
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో అప్‌డేట్‌తో యూజర్లను అలరించింది. నిన్న మొన్నటి వరకు వాట్సప్ యాప్ మొత్తం బ్లూ కలర్ థీమ్‌లో ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో గ్రీన్ ఇంటర్ ఫేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రశాంతత, స్థిరత్వం, ఇన్ప్పిరేషన్‌కు మారుపేరైన బ్లూ కలర్‌ను స్థానంలో గ్రీన్ కలర్ ఇంటర్ ఫేస్‌ను ఎందుకు అందుబాటులోకి తెచ్చిందా అని యూజర్లు చర్చించుకుంటున్నారు.
వాట్సప్ గ్రీన్ కలర్‌లోకి ఎందుకు మారింది?
వాట్సప్ మాతృసంస్థ మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ యూజర్లకు ఆధునిక, కొత్త అనుభవాన్నిఅందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తద్వారా వినియోగం సైతం మరింత సులభతరం కానుందన్నారు. ఇక, ఇంటర్ పేస్, రంగులు, చిహ్నాల రంగుల్ని సైతం మార్చినట్లు వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
రంగులు మార్చడానికి కారణం?
రంగు మార్పు కంటే వాట్సప్ వినియోగించే యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగు పరిచేందుకు యాప్‌లో మార్పులు చేపట్టినట్లు వాట్సప్ వెల్లడించింది. దీంతో పాటు వాట్సప్ తన మెసేజ్ కీబోర్డ్‌లలో కొన్ని పదాలను క్యాపిటలైజ్ చేసింది. కొంతమంది వినియోగదారులు ఆన్‌లైన్, టైపింగ్ మొదటి అక్షరాలను క్యాపిటలైజ్ చేసిన మార్పును గమనించారు. ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ గమనించిన ఈ మార్పు ఆన్‌లైన్‌లో ముఖ్యమైన చర్చలకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment