శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.దశమి రా.6.54 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఆశ్లేష ఉ.9.37 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.10.45 నుండి 12.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ఉ.7.54 నుండి 9.35 వరకు
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. చర్చల్లో ప్రతిష్ఠంభన. సోదరులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.
వృషభం: పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
మిథునం: వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. అనారోగ్యం.
కర్కాటకం: ఇంటాబయటా అనుకూలం. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు.
సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో వివాదాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.
కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చికం: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు.
ధనుస్సు: ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక చింతన.
మీనం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు అంతగా కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం.
Comments
Please login to add a commentAdd a comment