
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.ఏకాదశి రా.8.45 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: మఖ ఉ.11.54 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.8.45 నుండి 10.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05
వరకు, తదుపరి ప.12.23 నుండి 1.14 వరకు,
అమృతఘడియలు: ఉ.9.16 నుండి 10.43 వరకు.
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. పనులలో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
కర్కాటకం... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం... కొత్త వ్యక్తుల పరిచయం. మిత్రులతో సఖ్యత. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.
కన్య... చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
తుల... సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం... పనుల్లో విజయం. శుభకార్యాల నిర్ధారణ. బంధువులతో సత్సంబంధాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు అనుకూలిస్తాయి.
ధనుస్సు... సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం... ఆర్థిక ఇబ్బందులు. ఎంత ప్రయత్నించినా పనులను పూర్తి చేయలేరు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కుంభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
మీనం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment