న్యూఢిల్లీ: ‘డు నాట్ డిస్టర్బ్’ లిస్టులో నమోదు చేసుకున్నప్పటికీ మొబైల్ ఫోన్ యూజర్లకు అవాంఛిత కాల్స్ బెడద తప్పడం లేదు. ఏకంగా 92 శాతం సబ్‌స్క్రయిబర్స్‌కు రోజుకు కనీసం 1 కాల్ అయినా అలాంటిది వస్తోంది.
ఆన్‌లైన్ సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగాల సంస్థల నుంచి తమకు అత్యధికంగా అవాంఛిత కాల్స్ వస్తున్నాయని 78 శాతం మంది వెల్లడించారు. మొత్తం 11,157 మంది ఇందుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమివ్వగా వారిలో 66 శాతం మంది తమకు రోజుకు సగటున 3 లేదా అంతకు మించి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు
96 శాతం మంది తమకు అటువంటి కాల్ ఏదో ఒకటి ప్రతి రోజూ వస్తూనే ఉంటుందని వివరించారు. ఇక 16 శాతం మంది తమకు రోజుకు సగటున 6 10 కాల్స్ వస్తుంటాయని చెప్పగా 5 శాతం మంది 10 పైగా అవాంఛిత ఫోన్స్ వస్తుంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment