ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ భారత్‌లోని ఐటీ ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. దేశీయ వ్యాపారంలో వృద్ధిని అంచనా వేస్తూ 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో "పెద్ద సంఖ్యలో" ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది.
బిజినెస్ వార్త సంస్థ మింట్‌తో జరిగిన సంభాషణలో క్యాప్‌జెమినీ చీఫ్ టెక్నాలజీ & ఇన్నోవేషన్ ఆఫీసర్ నిషీత్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశ్రమలోని పోటీ కంపెనీలకు అనుగుణంగా తమ కంపెనీ హెడ్‌కౌంట్ పెరుగుతుందని తెలిపారు. ఇది ఐటీ సెక్టార్‌లో సవాలుగా ఉన్న 2024 ఆర్థిక సంవత్సరం తర్వాత సానుకూల మార్పును సూచిస్తుంది.
క్యాప్‌జెమినీకి 2024 ఫిబ్రవరి నాటికి భారత్‌లో 1,75,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నాస్కామ్ ప్రకారం 253.9 బిలియన్ డాలర్లు సంచిత రాబడితో 2024 ఆర్థిక సంవత్సరం ముగియగలదని అంచనా వేస్తున్న భారత ఐటీ రంగం.. స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా కాలంగా ఎదుర్కొంటున్న వ్యయ కట్టడి పరిస్థితి నుంచి పుంజుకునేలా కనిపిస్తోంది.
మింట్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో కంపెనీల్లో 49,936 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. మూడవ త్రైమాసిక ఫలితాలను అనుసరించి దేశీయ ఐటీ మేజర్లు వివిధ పరిశ్రమలలోని క్లయింట్ల సెంటిమెంట్‌కు అనుగుణంగా వ్యయం విషయంగా విచక్షణతో వ్యవహరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment