మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా..! ఐతే బీ కేర్ ఫుల్..! గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలను జారీ చేసింది. బ్రౌజర్‌లో లోపాలున్నట్లుగా తెలుస్తోంది.
భద్రతా లోపాలు..!
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో మరోసారి భద్రతా లోపాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT - In) క్రోమ్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. బ్రౌజర్‌లో కొన్ని విభాగాల్లో లోపాలు ఉన్నట్లు సెర్ట్-ఇన్ గుర్తించింది. యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ స్టోరేజీ, స్క్రీన్ కాప్చర్, సైన్ ఇన్, స్విఫ్ట్‌షేడర్, పీడీఎఫ్, ఆటోఫిల్, ఫైల్ మెనేజర్ ఏపీఐతో పాటు డెవ్‌టూల్స్, నావిగేషన్, ఆటోఫిల్, బ్లింక్, వెబ్‌షేర్‌లో, పాస్‌వర్డ్, కంపోసిటింగ్‌లో అనవసరమైన ఇంప్లిమెంటేషన్లు లోపాలకు కారణమని సెర్ట్-ఇన్ పేర్కొంది. ఈ లోపాలతో సైబర్‌నేరస్తులు ఆయా క్రోమ్ యూజర్ల డేటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇలా చేస్తే సేఫ్..!
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నెలకొన్న లోపాలనుంచి బయటపడేందుకు సెర్ట్-ఇన్ యూజర్లకు పలు సూచనలు చేసింది. ఆయా గూగుల్ క్రోమ్ యూజర్లు వెంటనే అప్‌డేట్ చేయాలని సూచించింది. గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ 97.0.4692.71 కు మారాలని వెల్లడించింది. గూగుల్ క్రోమ్ వెర్షన్ 97.0.4692.71 కంటే తక్కువ వెర్షన్ ఉంటే యూజర్ల భద్రతకే ప్రమాదమని సెర్ట్-ఇన్ అభిప్రాయపడింది. గూగుల్ క్రోమ్‌లోని లోపాలను గుర్తించిన గూగుల్ కొద్ది రోజల క్రితమే లేటెస్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. బ్రౌజర్‌లో నెలకొన్న 37 సమస్యలను గూగుల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
మీ క్రోమ్ బ్రౌజర్‌ని ఇలా అప్‌డేట్ చేయండి
- Google Chrome బ్రౌజర్‌ని ఒపెన్ చేయండి.
- కుడి ఎగువ మూలలో, మూడు చిన్న చుక్కలపై క్లిక్ చేయండి
- హెల్ఫ్‌పై క్లిక్ చేయండి. మీకు బ్రౌజర్ వెర్షన్‌ను చూపుతుంది. అప్‌డేట్ అప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇలా కాకుండా మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి..మై యాప్స్‌లో గూగుల్ క్రోమ్‌పై క్లిక్ చేసి అప్‌డేట్ అప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..!
Comments
Please login to add a commentAdd a comment