ప్రస్తుతం మొబైల్, కంప్యూటర్ వాడుతున్న ప్రతి పరికరంలో గూగుల్ క్రోమ్ కచ్చితంగా వినియోగిస్తారు. గూగుల్ క్రోమ్ ముఖ్యంగా విండోస్, ఆండ్రాయిడ్ లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్. వాస్తవానికి, ఈ బ్రౌజర్ ని చాలా ఆండ్రాయిడ్ పరికరాల్లో వాడుతుండటం మనం గమనించవచ్చు. వివాల్డి, ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్ బ్రౌజర్ వంటి అనేక ఇతర బ్రౌజర్లు కూడా క్రోమియం బ్రౌజర్ సర్చ్ ఇంజిన్ పై ఆధారపడి పనిచేస్తాయి. అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా ప్రమాదంలో ఉన్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం వాడుతున్న గూగుల్ క్రోమ్ లో హ్యాకర్లు హ్యాక్ చేయడానికి వీలుగా ఒక కొత్త బగ్ ఉన్నట్లు ఇటీవల కనుగొనబడింది. ఈ బగ్ ద్వారా హ్యాకర్ రిమోట్ గా బగ్ కోడ్ ను మీ మొబైలో ప్రవేశ పెట్టడానికి వీలుగా అనుమతించే ఒక పెద్ద భద్రతా లోపాన్ని కనుగొన్నట్లు గూగుల్ పేర్కొంది. అందుకే వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఇన్ స్టాల్ చేసిన వినియోగదారులు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని గూగుల్ పేర్కొంది. ఒకవేల క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేయకపోతే హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేయడమే కాకుండా, భద్రతా లోపం కారణంగా మీ డేటాను బహిర్గతం చేసే ప్రమాదం ఉంది.
కొత్తగా గుర్తించిన ఈ బగ్ ఇప్పటికే ఉపయోగంలో ఉన్నట్లు గూగుల్ తన బ్లాగులో వెల్లడించింది. తమకు తెలియకుండానే హ్యాకర్లు డేటాను దొంగలిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. హ్యాకర్లు హ్యాక్ చేసిన మిలియన్ డాలర్లకు డార్క్ వెబ్ లో విక్రయిస్తారు. పాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ లను ఉపయోగిస్తున్న క్రోమ్ యూజర్లు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. కచ్చితంగా మీ గూగుల్ క్రోమ్ వెర్షన్ 91.0.4472.164 ఉండాలని సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment