మండే వేసవిలో లగ్జరీ ఏసీ హోటల్‌లో విశ్రాంతి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడకుండా ఉంటారు? ఆఫీస్‌కి వెళ్లేందుకు చెమటలు కక్కుతూ ప్రయాణించాల్సిన పనిలేదు. ఆఫీస్ క్యాంపస్‌లోని హోటల్‌లోనే మకాం. అయితే ఈ ఆఫర్ గూగుల్ ఉద్యోగులకు మాత్రమే. వర్క్ ఫ్రం హోమ్‌కి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించడానికి గూగుల్ వేసిన కొత్త ఎత్తుగడ ఇది.
గూగుల్ ఫుల్‌టైమ్ ఉద్యోగులు క్యాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని క్యాంపస్ హోటల్‌లో ఒక రోజుకు 99 డాలర్లకే రూమ్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సమ్మర్ స్పెషల్ ఆఫర్ అంటూ దీన్ని పేర్కొన్నట్లు ‘సీఎన్‌బీసీ’ నివేదించింది. గూగుల్ ఉద్యగులు హైబ్రిడ్ వర్క్‌ప్లేస్‌కి మారడాన్ని సులభతరం చేసేలా సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అమలు అవుతుంది.
అయితే హోటల్‌లో బస చేసేందుకు అయ్యే మొత్తాన్ని తమ పర్సనల్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఉద్యోగులే భరించుకోవాలి. ఆ మొత్తాన్ని కంపెనీ రీయింబర్స్ చేయదు. ఎందుకంటే ఇది అన్‌అప్రూవ్డ్ బిజినెస్ ట్రావెల్ కిందకు వస్తుందని కంపెనీ పేర్కొంది.
ఉదయం హడావుడిగా ఆఫీసుకు రావాల్సిన పని లేదు. ఓ గంట ఎక్కువగా నిద్ర పోవచ్చు. మధ్యలో రూమ్‌కి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ లేదా వర్కవుట్ చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ పూర్తయ్యాక హోటల్ టాప్ డెక్‌కి వెళ్లి ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని ఆస్వాదించవచ్చు అంటూ ఈ ఆఫర్‌కు సంబంధించిన ప్రకటన చెబుతోంది.
గూగుల్ యాజమాన్యంలోని ఈ హోటల్ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గత సంవత్సరం ప్రారంభించిన కొత్త క్యాంపస్‌లో ఉంది. 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్‌కు ఆనుకుని ఉంది. ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న 4,000 మంది ఉద్యోగులకు ఇక్కడ వసతి కల్పించే సామర్థ్యం ఉందని దీని ప్రారంభం సందర్భంగా కంపెనీ పేర్కొంది.
శాన్‌ఫ్రాన్సిస్‌కో బే ఏరియా రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా ఉంటాయి. చాలా టెక్ కంపెనీల కార్యాలయాలతో పాటు టెక్ పరిశ్రమ ఉద్యగులు ఇక్కడ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడున్న కార్పొరేట్ కార్యాలయాలు చాలా గూగుల్ యాజమాన్యంలోనివో లేకుంటే లీజ్‌కు తీసుకున్నవో ఉంటాయి. కంపెనీకి చెందిన హోటళ్లలో ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు తరచూ ఇస్తుంటామని గూగుల్ ప్రతినిధి తెలిపారు.
Google Jobs Cut 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గూగుల్.. వాళ్లు చేసిన పాపం ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment