నష్టాలను తగ్గించుకున్న పేటీఎం | Sakshi
Sakshi News home page

నష్టాలను తగ్గించుకున్న పేటీఎం

Published Sat, Jan 20 2024 6:20 AM

Paytm Q3 Revenue jumps 38 per cent - Sakshi

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ కంపెనీ, పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ డిసెంబర్‌ త్రైమాసికంలో నష్టాలను రూ.222 కోట్లకు తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర నష్టం రూ.392 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.2,850 కోట్లకు దూసుకుపోయింది. సబ్‌్రస్కిప్షన్‌ ఆదాయం గణనీయమైన వృద్ధిని చూసిందని, మార్జిన్లు మెరుగుపడ్డాయని, చెల్లింపుల వ్యాపారం ఆదాయం పెరిగినట్టు పేటీఎం ప్రకటించింది.

వర్తకులు వినియోగించే పేటీఎం పేమెంట్‌ డివైజ్‌లు డిసెంబర్‌ చివరికి 1.06 కోట్లకు పెరిగాయి. పేమెంట్స్‌ వ్యాపారం ఆదాయం 45 శాతం పెరిగి రూ.1,730 కోట్లు, నికర చెల్లింపుల మార్జిన్‌ 63 శాతం పెరిగి రూ.748 కోట్లుగా ఉన్నాయి. మర్చంట్స్‌ పేమెంట్స్‌ వ్యాల్యూమ్‌ (జీఎంవీ) 47 శాతం వృద్ధితో రూ.5.10 లక్షల కోట్లకు చేరింది. ఫైనాన్షియల్‌ సరీ్వసుల ద్వారా ఆదాయం 36 శాతం పెరిగి రూ.607 కోట్లుగా నమోదైంది. డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.15,535 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో 56 శాతం వృద్ధిని చూపించింది. గడిచిన ఏడాదిలో పేటీఎం ద్వారా రుణాలను తీసుకునే యూజర్లు 44 లక్షలు పెరిగి మొత్తం 1.25 కోట్లకు చేరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement