ముంబై: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై కనీస వడ్డీ రేట్లను 7.55 శాతానికి పెంచింది. బుధవారం నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఆర్‌బీఐ రెపో రేటు 4.40% నుంచి 4.90%కి పెంచిన నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. మేలో ఈ రేటు 4% నుంచి 4.4%కి చేరిన సంగతి తెలిసిందే. వెబ్‌సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్ రేటును (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్)ను కూడా ఎస్‌బీఐ జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంపుదల చేసింది. ప్రస్తుతం ఈ రేటు 6.65 శాతం ప్లస్ క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్‌పీ)ను కలిగి ఉంది. తాజాగా ఈ రేటు 7.15 శాతానికి చేరింది.
బీఓబీ డిపాజిట్ రేట్ల పెంపు
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్‌లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు 40 బేసిస్ పాయింట్ల వరకూ బుధవారం ప్రకటించింది.
చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే?
Comments
Please login to add a commentAdd a comment