ప్రముఖ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కంపెనీ యాపిల్‌కు గట్టి షాక్ ఇస్తూ కోర్టుకు ఈడ్చింది బ్రిటిష్ లోకల్ ఆథారిటీ. ఐఫోన్ అమ్మకాల క్లెయిమ్స్ విషయంలో షేర్ హోల్డర్స్‌ను తప్పుదారి పట్టించినందుకు యాపిల్‌పై దావా పడింది.
నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ దావాలో...యాపిల్ జనవరి 2019లో లాభాల హెచ్చరికను జారీ చేయడానికి ముందు ఐఫోన్ల విక్రయానికి సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనలను యాపిల్ చేసిందని నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ ఆరోపించింది. ఈ కౌన్సిల్ 3.8 బిలియన్ యూరోల పెన్షన్ ఫండ్‌ను నడిపిస్తోంది. ఇది యాపిల్‌లో షేర్ హోల్డర్ కంపెనీగా ఉంది.
2018లో చైనాలో ఐఫోన్ల డిమాండ్‌పై వాటాదారులను తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ యాపిల్ చీఫ్ ఎర్జిక్యూటివ్ టిమ్ కుక్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మ్యాస్తిపై దావా వేసింది. కొన్ని నివేదికల ప్రకారం...యాపిల్ ఐఫోన్ అమ్మకాల ఒత్తిడి చూసే అవకాశం ఉందని కుక్ 2018లో వాటాదారులతో చెప్పారు.
షేర్ హోల్డర్లకు న్యాయం కుదిరేలా..!
జనవరి 2019లో యాపిల్ తన లాభాల అంచనాలను దాదాపు 6 బిలియన్ల యూరోల మేర కోల్పోనుందని కుక్ పెట్టుబడిదారులకు పేర్కొన్నాడు. అయితే నవంబర్ 2018లో ఐఫోన్ అమ్మకాలు సరిగ్గా జరపలేదనే విషయం కుక్ కు ముందే తెలుసునని నార్బోక్ కౌంటీ కాన్సిల్ వాదించింది. దీని వల్ల కౌన్సిల్ పెన్సన్ ఫండ్ దాదాపు 1 బిలియన్ డాలర్లlను నష్టపోయినట్లు పేర్కొంది. ఈ కౌన్సిల్ వేసిన దావాలను కాలిఫోర్నియా న్యాయమూర్తి క్షాస్-యాక్ష న్ హోదాను మంజూరు చేయగా...దీనిలో ఇతర వాటాదారులను కూడా కేసులో చేరేందుకు అనుమతించనుంది. ఒక వేళ యాపిల్‌పై వేసిన ఆరోపణలు నిజమని తెలిస్తే కంపెనీ భారీ మూల్యాన్ని చెల్లించనుంది.
చదవండి: ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ షాక్!
Comments
Please login to add a commentAdd a comment