న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రోన్స్ ప్రాంతంలోని 19 అంతస్తుల భవంతిలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు మంటలు వ్యాపించడం మొదలైంది. భారీ స్థాయిలో మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ వేగంగా విస్తరించడంతో వాటిల్లో చిక్కుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. ఆఫ్రికాలోని గాంబియా నుంచి వలస వచ్చిన ముస్లిం కుటుంబాలు ఆ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ట్వీట్ చేశారు.
దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. ఒక బెడ్‌రూమ్‌లోని ‘గదిని వేడిగా ఉంచే ఎలక్ట్రిక్ హీటర్’ నుంచి మంటలు మొదలై గది మొత్తం విస్తరించి, తర్వాత అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని న్యూయార్క్ అగ్నిమాపక విభాగం కమిషనర్ డేనియల్ నీగ్రో వివరించారు. బిల్డింగ్‌లోని ప్రతీ ఫ్లోర్‌లోని మెట్ల వద్ద అపార్ట్‌మెంట్ వాసులు విగతజీవులై కనిపించారని ఆయన తెలిపారు. విపరీతంగా కమ్మేసిన పొగకు ఊపిరాడక, గుండె ఆగిపోవడంతో కొందరు మరణించారని కమిషనర్ వెల్లడించారు. 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment