కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న దావూద్‌ను సోమవారం పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారట.
అయితే అతనిపై విష ప్రయోగం జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. అతను మరో రెండు రోజుల పాటు ఆసత్రిలో ఉండి చికిత్స తీసుకొనున్నట్లు సమాచారం.
పాక్ మీడియా కథనాల ప్రకారం.. ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే పేషెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ మాఫియా డాన్ గురించి ఈ ఏడాది జనవరిలో అతని సోదరి ఆసక్తికర విషయాలు చెప్పింది. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి దావూద్ కరాచీలోనే ఉంటున్నట్లు ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణలో ఆమె తెలిపింది. మరోవైపు.. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు.. పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment