ఇజ్రాయెల్: బైజాంటైన్ యుగంనాటి 1500 ఏళ్ల పురాతన పారిశ్రామిక వైన్ కాంప్లెక్స్‌ని ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పట్లోనే ఇది ఏటా రెండు మిలియన్ లీటర్ల వైన్‌ని ఉత్పత్తి చేసేదని అన్నారు. అంతేకాదు ఇది ప్రపంచంలోని అతి పెద్ద కేంద్రంగా ఉండేదని చెబుతున్నారు. బైబిల్ కాలంలో యూదులు స్థావరంగా ఉండే టెల్ అవీవ్‌కి దక్షిణాన ఉన్న యవ్నేలో ఈ అత్యాధునిక సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు.
(ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి)
క్రీస్తూ శకం 70లలో జెరుసలేం నాశనమైన తరనంతరం ఒక ముఖ్య నగరంలో ఐదు వైన్ కాంప్లెక్స్‌లు ఒక చదరపు కిలో మీటరు మేర విస్తరించి ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు వైన్‌ని నిల్వచేయడానికి ఉపయోగించే బంకమట్టి ఆంఫోరాలు, వైన్ తయారు చేయడానికి వాడే బట్టీలు, మట్టి పాత్రలు తదితర సామాగ్రి చెక్కు చెదరకుండా అత్యంత అధునాతనంగా ఉన్నాయని ఇజ్రాయెల్ పురాతన వస్తువుల ప్రాధికార సంస్థ పేర్కొంది.
ఈ వైన్‌ని గాజా, అష్కెలోన్ వైన్ వంటి పేర్లతో పిలిచేవారని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు అప్పట్లోనే ద్రాక్ష రసాన్ని పులియబెట్టే ప్రక్రియలు ఉండేవని అంటున్నారు. అదే ప్రదేశంలో పురావస్తు అధికారులు రెండు సంవత్సరాల పాటు జరిపిన తవ్వాకల్లో రెండు వేల ఏళ్లనాటి పర్షియన్ కాలపు వైన్‌లు కూడా బయటపడ్డాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment