రోమ్: ఉత్తర ఇటలీ ఆదివారం ఓ కేబుల్ కారు తెగిపడి... 13 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడగా... వీరి పరిస్థితి విషమంగా ఉంది. మాగియోర్ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి చూసేందుకు వీలుగా పక్కనే ఉన్న మొటారోన్ పర్వతం పైకి కేబుల్ కారు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరో 100 మీటర్లు వెళితే పర్వత శిఖరంపై దిగుతారనగా... ఒక్కసారిగా కేబుల్ తెగిపోయింది.
15 మంది ప్రయాణికులు కూర్చున్న కేబుల్ కారు అమాంతం కిందపడిపోయి పల్టీలు కొడుతూ చెట్లను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు దూరంగా విసిరేసినట్లుగా పడిపోయారు. 2016లోనే ఈ కేబుల్ లైన్‌ను పునర్నిర్మించారని స్టెసా మేయర్ మార్సెల్లా సెవెరినో తెలిపారు. కరోనా కారణంగా మూతబడిన ఈ పర్యాటక ప్రదేశాన్ని ఇటీవలే తెరిచారని వెల్లడించారు. 1998 తర్వాత జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని మీడియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment