వాషింగ్టన్:గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో సాధారణ పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని హెచ్చరించారు.
కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో జో బైడెన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బైడెన్.. ఇజ్రాయెల్‌పై అమెరికా విధానం గాజాలోని పౌరుల రక్షణపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పౌరులే లక్ష్యంగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. గాజాలో వెంటనే కాల్పుల విరమణను పాటించాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. స్వచ్ఛంద సంస్థ ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’కు చెందిన ఏడుగురు సహాయకులను తాజాగా ఇజ్రాయెల్ చంపివేయడంపై అమెరికా సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో యుద్ధం అన్నాక ఇటువంటివి సహజమేనని నెతన్యాహూ కామెంట్స్ చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తమ వాహనం మీద దాడిచేశాయని ఈ చారిటీ సంస్థ అధినేత ఆరోపిస్తున్నారు. ఆ వాహనం ఒక సహాయక సంస్థదని తెలియచెప్పే గుర్తులు దాని మీద స్పష్టంగా ఉన్నాయి. పైగా ఐడీఎఫ్‌తో సమన్వయం చేసుకుంటూ ఘర్షణలేని ప్రాంతం గుండా అది ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. మూడుసార్లు కాల్పులు జరపడం, కొందరు చనిపోగా, పారిపోతున్న మిగతా సహాయకసిబ్బందిని కూడా వదిలిపెట్టకుండా హతమార్చడం త్రీవ పరిణామంగా మారింది.
JUST IN: President Biden warns PM Netanyahu that future U.S. support for Israel depends on actions taken to shield civilians in Gaza. #Israel #Gaza #USA
— The Reportify (@TheReportify) April 4, 2024
ఇక, హమాస్‌తో పోరులో ఇజ్రాయెల్ అనేక విధాలుగా అతిక్రమణలకు పాల్పడుతోంది. అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. గాజాలో ఆపన్నులకు కాస్తంత సాయాన్ని అందిస్తున్న ఏడుగురు వర్కర్లను ఇజ్రాయెల్ దళాలు కాల్చివేయడం, మిగిలివున్న ఆ ఒక్క ప్రధాన ఆస్పత్రిని కుప్పకూల్చడం, పొరుగుదేశంలోని మరోదేశం కాన్సులేట్ మీద దాడిచేసి కీలకమైన వ్యక్తులను చంపివేయడం వంటి చర్యలకు ఇజ్రాయెల్ పాల్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment