శనివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2024
ఆ పథకాలు ఉండేనా..
● దళితబంధు, గొర్రెల పంపిణీ అమలుపై గందరగోళం ● స్పష్టత లేకపోవడంతో అర్జీదారుల అయోమయం ● కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు
కరీంనగర్:
‘గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు పథకాలపై స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ, బీసీ కులవృత్తులకు చేయూత, గృహలక్ష్మి పథకాలకు ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి చెందడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సదరు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్త్తుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళితబంధు పథకంలో లబ్ధిపొందిన కొంత మందికి పూర్తిస్థాయిలో డబ్బులు అందకపోవడంతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాగే గొర్రెల పంపిణీకి లబ్ధిదారు వాటా కింద డీడీలు చెల్లించిన వారు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని కోరుతున్నారు. గృహలక్ష్మి పథకంతో ఓ ఇంటివారమవుతామని కలలు కన్నవారి ఆశలు అడిశయాలయ్యాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి, బీసీ చేయూత పథకాలు కొనసాగుతాయో లేదోననే సందిగ్ధంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.’
ఎన్నికల ముందే రెండోవిడత..
జిల్లాలో ఎన్నికలకు ముందే రెండో విడత దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రతీ నియోజకవర్గంలో 1,100 మందికి అవకాశం ఇచ్చారు. ప్రాధాన్యం కింద నియోజకవర్గానికి 500మంది చొప్పున ఎంపిక చేశారు. కొంతమంది పేర్లను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేశారు. మొదట రూ.3లక్షలు అందిస్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో తర్వాత చర్యలు చేపట్టలేదు. కలెక్టరేట్‌కు వచ్చి దళితబంధు మంజూరు చేయాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితి ఎదురుకావడంతో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఈ పథకాలు కొనసాగే అవకాశం ఉంది.
గొర్రెల పంపిణీ పథకం
జిల్లాలో గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని 2015లో ప్రారంభించారు. మొదటి విడత కింద ఎంపిక చేసినవారికి గొర్రెలు పంపిణీ చేశారు. జిల్లాలో రెండో విడత కింద 10,236 యూనిట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 718 యూనిట్లను పంపిణీ చేశా రు. మిగతావారికి 2018–19 ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేయాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల చేయలేదు. మిగిలిన 9,518 యూనిట్ల పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో 2,686 మంది వాటాగా రూ.43,750 చెల్లించి గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నట్లు జిల్లా యాదవ కుర్మ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. డీడీలు కట్టిన వారు నిత్యం పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరిగివెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో అధికారులు కూడా లబ్ధిదారులకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల యూ నిట్లపై సమీక్షిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు.
న్యూస్‌రీల్
వెంటనే పంపిణీ చేయాలి
రెండో విడత గొర్రెల పంపిణీ కోసం గత ప్రభుత్వంలో డీడీలు కట్టి వేచి చూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా గొర్రెల పంపిణీ మాత్రం చేయడం లేదు. లబ్ధిదారులు అందినచోటల్లా అప్పులు తెచ్చి మరీ డీడీలు కట్టారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల యూనిట్లను పంపిణీ చేసి ఆదుకోవాలి.
– బండి మల్లయ్యయాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ పరిధిలోని అంశం
దళితబంధు పథకం లబ్ధిదారుల అంశం ప్రభుత్వ పరధిలోని వ్యవహారం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతానికి స్టేటస్‌కోలో దళితబంధు పథకం ఉంది. లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న డబ్బు విడుదలపై ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం.
– నాగార్జున, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
Comments
Please login to add a commentAdd a comment