సమ్మర్ పేరు చెప్పగానే పిల్లలకు సెలవులు గుర్తొస్తాయి. వయసైన పెద్దోళ్లకు టూర్స్ గుర్తొస్తాయి. అదే మూవీ లవర్స్‌కు మాత్రం కొత్త సినిమాలే గుర్తొస్తాయి. ఏ వారం ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా? దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ ఎదురుచూసేవాళ్లు. గత కొన్నేళ‍్లుగా వేసవికి తెలుగు బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. ఈసారి మాత్రం సందడి, హడావుడి ఏం లేకుండానే గడిచిపోయింది.
భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు.. సంక్రాంతి, సమ్మర్, దసరా పండగ లాంటి వాటిని టార్గెట్ చేసుకుని మూవీస్ తీస్తుంటారు. ఈసారి సంక్రాంతికి చిరు-బాలయ్య హిట్స్ కొట్టేశారు. మార్చి చివర్లో నాని కూడా హిట్ కొట్టేశాడు. పాన్ ఇండియా చిత్రాలతో పెద్ద హీరోలందరూ బిజీ అయిపోవడంతో వాళ్లెవరివీ ఈసారి సమ్మర్ కు రిలీజ్ కాలేదు. ఇది మీడియం రేంజ్ హీరోలకు వరమైంది. కానీ దాన్ని వాళ్లు సరిగా వినియోగించుకోలేకపోయారు.
(ఇదీ చదవండి: ఒక్క యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు అన్ని కోట్లా?)
ఏప్రిల్ నెలని తీసుకుంటే.. తొలివారంలో రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' మూవీతో థియేటర‍్లలోకి వచ్చారు. ఈ రెండు కూడా తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, ప్రేక్షకుల డిసప్పాయింట్ చేశాయి. రెండోవారం సమంత 'శాకుంతలం' వచ్చింది. ట్రైలర్ కాస్త అటుఇటుగా ఉండటంతో అందరూ డౌట్ పడ్డారు. కరెక్ట్ గా అదే జరిగింది. ప్రీమియర్ షోలకే అసలు విషయం తెలిసిపోయింది. సామ్ కెరీర్ లోనే ఘోరమైన ఫ‍్లాప్ గా ఇది నిలిచింది. మూడో వారం వచ్చిన 'విరూపాక్ష'.. ఎవరూ కనీసం ఎక్స్ పెక్ట్ చేయనంత హిట్ అయిపోయింది.
పూర్తిస్థాయి హారర్ కాన్సెప్ట్ కావడం 'విరూపాక్ష'కు చాలా ప్లస్ అయింది. స్టోరీకి సుకుమార్ తనదైన శైలిలో టచ్ ఇచ్చేసరికి.. ఈ సినిమా జనాలకు తెగ నచ్చేసింది. లాంగ్ రన్ లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. చివరి వారంలో వచ్చిన అఖిల్ 'ఏజెంట్'పై రిలీజ్ కి ముందు కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మార్నింగ్ షోకే రిజల్ట్ తేలిపోయింది. బొమ్మ ఫట్ అయిపోయింది. ఇలా ఏప్రిల్ మొత్తమ‍్మీద టాలీవుడ్ కి ఒక్కటంటే ఒక్కటే హిట్ దక్కింది.
(ఇదీ చదవండి: టిఫిన్ సెంటర్‌కు స్టార్ హీరోయిన్.. ఎవరూ గుర్తుపట్టలేదు!)
మే నెలని తీసుకుంటే.. తొలివారం గోపీచంద్ 'రామబాణం', అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాలతో వచ్చారు. వీటిలో 'రామబాణం' ఫట్ మని బుడగలా పేలిపోయింది. 'ఉగ్రం' పర్వాలేదనిపించింది. కానీ పెద్దగా జనాలు తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. రెండో వారం వచ్చిన 'కస్టడీ'పై అక్కినేని ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ చైతూ వాళ్లని పూర్తిగా నిరాశపరిచాడు. నీరసమైన స్టోరీ లైన్ వల్ల చూసిన ప్రతిఒక్కరూ డిసప్పాయింట్ అయ‍్యారు. ఈ మూవీని ఫ‍్లాప్ గా డిక్లేర్ చేశారు. మూడో వారంలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' చాలా అంటే చాలా నిరాశపరిచింది. మే చివరి వారంలో వచ్చిన 'మేమ్ ఫేమస్'కి కూడా సేమ్ రిజల్ట్.
ఇలా ఎంతో సందడిగా ఉంటుందనుకున్న సమ్మర్.. ఎప్పుడూ లేనంత నీరసంగా సాగింది. 'బిచ్చగాడు 2' , 2018 లాంటి ఒకటి రెండు డబ‍్బింగ్ సినిమాలు.. ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశాయి గానీ మూవీ లవర్స్ ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' పైనే ఉన్నాయి. మరి రామయణం ఆధారంగా తీసిన ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో ఏమో?
(ఇదీ చదవండి: సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్)
Comments
Please login to add a commentAdd a comment