ప్రముఖ గీత రచయిత ప్రియన్ కథానాయకుడిగా అవతారమెత్తి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అరణం. వర్ష హీరోయిన్‌గా నటించిన ఇందులో లఘుబరన్, కీర్తన ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 9వ తేదీన విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌తో 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ సినిమా చేయడం అవసరమా?..
ఈ వేదికపై చిత్ర కథానాయకుడు, దర్శకుడు ప్రియన్ మాట్లాడుతూ.. అరణం సక్సెస్ సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాకుండా పలువురు చిన్న నిర్మాతలకు, కళాకారులకు కొత్త ధైర్యాన్ని అందించిందన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, ఇలాంటి సమయంలో ఈ చిత్రం చేయడం అవసరమా అని హెచ్చరించిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారన్నారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక చాలా సమస్యలు ఉన్నట్టు ఇంతకుముందు ఆడియో ఆవిష్కరణ వేదికపైనే చెప్పానని అదేవిధంగా అరణం విజయాన్ని సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశానని, ఇప్పుడదే నిజమైందన్నారు.
విశాల్ మాట విని వెనక్కు వెళ్లిపోయారు
ఈ చిత్ర నిర్మాణంలో తాను చాలా నేర్చుకున్నానన్నారు. కొన్ని చిత్రాలు విడుదలైన వారంలోనే వేడుకలను జరుపుకుంటున్నప్పుడు, 25 రోజులుగా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తమ చిత్రానికి వేడుకలు ఎందుకు జరుపుకోకూడదన్నారు. మూడు, నాలుగు కోట్ల రూపాయలతో చిత్రాలు చేయడానికి నిర్మాతలు రావొద్దని విశాల్ చెప్పడంతో చాలామంది తిరిగి వెళ్లిపోయారన్నారు. కానీ హీరోలను కాకుండా కథను నమ్మి చిత్రాలు చేస్తే విజయం తథ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాల్ వ్యాఖ్యలను చెత్తబుట్టలో వేయండన్నారు. సినిమాను సినిమా వాళ్లే చంపేస్తున్నారని ఆరోపించారు.
చదవండి: మేము ప్రశ్నిస్తే.. అన్నింటికీ సిద్ధపడే ఈ వృత్తిలోకి వచ్చారు కదా అంటున్నారు: రష్మిక
Comments
Please login to add a commentAdd a comment