తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్(తమిళంలో వాతి). తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాష(తెలుగు, తమిళం) తెరకెక్కిన ఈచిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విద్యా వ్యవస్థ నేపథ్యం రూపొందిన ఈ చిత్రం ఆడియో లాంచ్ వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ తన స్టూడెంట్ లైఫ్‌ని గుర్తు చేసుకున్నాడు.
చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ
చదువును నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానని, తనలా ఎవరూ చేయొద్దని అభిమానులకు సూచించాడు. ‘‘మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో నా పిల్లల్ని చదివిస్తుంటే నాకు అర్థమవుతోంది. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేస్తూ అల్లరి చేసేవాడిని. చదవడానికి కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్‌లో చేరా. ట్యూషన్ టీచర్ ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేకపోయేవాడిని. ట్యూషన్‌కి కూడా సరిగా వెళ్లకుండ బయట ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసేవాడిని.
చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..
నేను వచ్చిన విషయం తనకి తెలియాలని బైక్ సౌండ్ చేస్తుండేవాడిని. అది గమనించిన మా ట్యూషన్ టీచర్ ‘మీరంతా బాగా చదువుకుని పాసై ఉన్నత స్థానంలో ఉంటారు. బయట వాహనంతో శబ్దం చేసేవాడు మాత్రం వీధుల్లో డాన్స్ చేసుకోవాల్సిందే’ అన్నారట. ఆయన చెప్పినట్లు తమిళనాడులో నేను డాన్స్ చేయని వీధి లేదు(నవ్వుతూ చెప్పాడు). ఇక వెనక్కి తిరిగి చూస్తే నేనెందుకు చదువుని నిర్లక్ష్యం చేశానా? అని చింతిస్తున్నా. మీరు నాలా చేయకండి’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment