టాలీవుడ్ దర్శకుల్లో వివి వినాయక్‌ది ప్రత్యేక శైలి. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాకే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డ్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, లక్ష్మీ, సాంబ, బన్నీ, బద్రినాథ్, అదుర్స్, అఖిల్, ఖైదీ నంబర్150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన ఇంటలిజెంట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా హిందీ ఛత్రఫతి రీమేక్ డిజాస్టర్ కావడంతో వినాయక్ పనైపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(ఇది చదవండి: బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా?)
అయితే సరిగ్గా అదే కోవలోకి మరో డైరెక్టర్ చేరిపోయాడు. అఖిల్ ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. అతనొక్కడే చిత్రం ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సురేందర్..కిక్, రేసుగుర్రం, ధృవ లాంటి హిట్ చిత్రాలు అందించారు. ఊసరవెల్లి, అతిథి, కిక్-2, సైరా లాంటి ఫ్లాప్‌లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
అయితే ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీపై ఎవరితో అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మించిన సురేందర్ రెడ్డికి ఇప్పుడు యంగ్ హీరోలే మిగిలారు. తాజాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే సురేందర్ రెడ్డి సినిమాకు ఫైనాన్స్ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి వచ్చిందని సినీవర్గాల టాక్. ఏదేమైనా టాలీవుడ్‌లో సురేందర్ రెడ్డి మరో వి.వి. వినాయక్ అవుతాడా అనే విషయంపై చర్చ నడుస్తోంది.
(ఇది చదవండి: అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!)
Comments
Please login to add a commentAdd a comment