Rashmika Mandanna Lost Movie Chance With Chiranjeevi And Vijay - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: చిరంజీవి, విజయ్‌ విషయంలో చాలా బాధపడ్డాను: రష్మిక మందన్న

Published Fri, Jul 21 2023 7:53 AM

Rashmika Mandanna Movie Chance Lost Chiranjeevi And Vijay - Sakshi

నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు. నటిగా శాండిల్‌ వుడ్‌లో పుట్టి టాలీవుడ్‌లో ఎదిగి, కోలీవుడ్లోనూ మెరిసి తాజాగా బాలీవుడ్‌లో వాలిన ఫీనిక్స్‌ బర్డ్‌ రష్మిక. అయితే తమిళం, హిందీ భాషల్లో నటించిన చిత్రాలు ఆశించిన విధంగా విజయాన్ని సాధించలేదనే కొరత ఉందన్నది ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది. కాగా హిందీ చిత్రాలతో బిజీగా ఉండటం వల్లో, ఇతర కారణాల వల్లో గానీ ఇటీవల టాలీవుడ్‌లో అవకాశాలను జారవిడుచుకుంటోంది.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కె' టైటిల్‌, గ్లింప్స్‌ విడుదల.. హాలీవుడ్‌ రేంజ్‌లో సీన్స్‌)

కాగా ఈ భామ ఇటీవల ఒక భేటీలో తన సినీ జీవితం గురించి పేర్కొంటూ కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా నంబర్‌ వన్‌ కావచ్చని చెప్పింది. తాను ప్రారంభ దశలో మోడలింగ్‌ చేసి ఆ తర్వాత నటిగా పరిచయం అయినట్లు పేర్కొంది. సినిమా రంగంలో అదృష్టం చాలా ముఖ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు తమిళంలో విజయ్‌ సూపర్‌ హిట్‌ సినిమా మాస్టర్‌ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా, చేజార్చుకున్నానని తెలిపింది.

అంత పెద్దస్టార్స్‌ తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని, అలాంటిది ఆ అవకాశాలను వదులుకోవడం బాధనిపించిందని పేర్కొంది. సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని పేర్కొంది. ప్రేమ పెళ్లి అనేది కొన్ని సమయాల్లో విడదీయలేని బంధం అవుతాయని పేర్కొంది. అయితే కొన్ని సార్లు అవి బలహీనంగా కూడా మారతాయని చెప్పింది.

(ఇదీ చదవండి: గుంటూరు కారం కోసం మహేష్‌ రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా..!)

Advertisement
 
Advertisement
 
Advertisement