జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారామె.
శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment