ప్రముఖ సింగర్ అంగారాగ్ మహంత అలియాస్ పాపోన్ ఆస్పత్రిలో చేరాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. తన కుమారుడు కూడా పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.
(ఇది చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!)
పాపోన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మనమందరం ఈ చిన్న చిన్న యుద్ధాలను ఒంటరిగా పోరాడుతున్నాం. ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ నిన్న రాత్రి జరిగింది మాత్రం వేరు. ఎందుకంటే మొదటిసారి 13 ఏళ్ల నా కుమారుడు ఆసుపత్రిలో రాత్రి నాకు కాపలాగా ఉన్నాడు. ఈ భావోద్వేగ క్షణం గురించి నా స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోవాలనుకుంటున్నా. నా తల్లితండ్రుల కోసం నేను ఇలాగే చేసినట్లు నాకు గుర్తుంది. ఇప్పుడు వారి మనవడు పుహోర్ తన బాధ్యతను తీసుకోవడం చూసేందుకు వారు చుట్టూ ఉన్నారని అనుకుంటున్నా. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు! నేను ఇప్పుడు చాలా బాగున్నా.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
(ఇది చదవండి: Prabhas: ప్రభాస్ పేరుతో రూ.4 వేల కోట్ల దందా!)
కాగా.. పాపోన్ 1998లో తన మ్యూజిక్ కెరీర్‌ను మొదలుపెట్టారు. అస్సామీలో మంచి ఆల్బమ్స్ చేశారు. 2006లో స్ట్రింగ్స్ అనే సినిమాలో ఓం మంత్ర అనే పాట పాడి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అస్సామీతో పాటు హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో సాంగ్స్ ఆలపించారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment