సోనూ సూద్‌కు అరుదైన గౌరవం | Sakshi
Sakshi News home page

‘ఇది ఎప్పటికి నాకు అతిపెద్ద ఆవార్డు’

Published Wed, Oct 21 2020 9:36 PM

Sonu Sood Honoured with Life Size Idol Durga Puja Pandal In Kolkata - Sakshi

కోల్‌కతా: నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కోసం ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చిన విషయం తెలసిందే. దీంతో ఆయన రియల్‌ హీరో అయ్యారు. కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి చేయూతనిచ్చిన ఆయనను కోల్‌కతాలోని కేష్టోపూర్ ప్రఫుల్ల కననదుర్గా పూజ కమిటీ వారు ప్రత్యేకంగా సత్కరించారు. ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతున్న దుర్గపూజ పండల్‌లో సోనూ సూద్‌ విగ్రహాన్ని ప్రదర్శించి ఇలా ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అది చూసిన సోనూ సూద్‌ స్పందిస్తూ... ఇది తనకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం అంటూ అనందం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ట్వీట్‌ చేస్తూ.. ‘ఎప్పటికైన ఇదే నాకు అతిపెద్ద ఆవార్డు’ అంటూ ట్వీట్‌ చేశారు. అదే విధంగా కెష్టోపర్‌ ప్రఫుల్ల దుర్గా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: వలస దుర్గమ్మ..)

అయితే ఈ పండల్‌లో లాక్‌డౌన్‌లో వలస కార్మికులను బస్సులో తరలిస్తున్నప్పటి సోనూసూద్‌ విగ్రహాంతో పాటు ఎదురుగా వలస కార్మికులు చేతులు జోడిస్తున్న విగ్రహాలను ఉంచారు. అదే విధంగా సంక్షోభ కాలంలో వలసదారులకు సంబంధించిన హృదయ విదాకర దృశ్యాలను కూడా పండల్‌లో‌ ప్రదర్శించారు. హర్యానాలోని గురుగ్రామ్‌ నుంచి బీహార్‌ వరకు 1200 వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తన కూమరుడిని సూట్‌కేసుపై లాక్కెళుతున్న మహిళా, బాబును ఓడిలో పెట్టుకుని గాయపడిన తన తండ్రిని దొపుడు బండిపై కుర్చోపెట్టి లాక్కెడం, సైకిల్‌ తోక్కుతున్న మహిళ విగ్రహాలను కూడా ప్రదర్శించారు. అయితే లాక్‌డౌన్‌లో సోనూ సూద్‌ వలస కార్మికులను సొంత ఖర్చులతో వారి గ్రామాలకు చేర్చడంతో పాటు విదేశాల్లో చిక్కుకున్న  భారతీయులను సైతం స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. (చదవండి: మరోసారి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement