‘‘అజయ్ భూపతికథ చెబితే సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. ‘మహాసముద్రం’ కథ వింటూ పదిసార్లు ఉలిక్కిపడ్డా. అయితే డేట్స్ కుదరక నేనా సినిమా చేయలేకపోయా. ఒక్క మాటలో మాట్లాడుకునే పాయింట్‌తో ‘మంగళవారం’ని రెండున్నర గంటల సినిమాగా నిజాయతీగా చెపారు అజయ్ భూపతి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు.
పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో అజయ్ భూపతి మాట్లాడుతూ–‘‘పాయల్ పాత్రని అర్థం చేసుకుంటారా? రిసీవ్ చేసుకుంటారా అని కాస్త భయపడ్డా. అయితే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు’’ అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘నా సినిమా అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చని అనుకుంటారేమో... ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. ప్రతి నటుడు శుక్రవారం తన జీవితం మారుస్తుందని వెయిట్ చేస్తాడు. నాకు ఒక 'మంగళవారం' మార్చింది. నా జీవితంలో గుర్తుపెట్టుకునే 'మంగళవారం' ఇది. దీనికి కారణం అజయ్ భూపతి. ఆయన ఆడిషన్స్ అంటే మళ్లీ వెళతా’ అన్నారు. ‘మా సంస్థలో తీసిన తొలి సినిమా ‘మంగళవారం’ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనం’ అన్నారు సురేష్ వర్మ.
Comments
Please login to add a commentAdd a comment