జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇవాళ ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. . పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్‌పై మెరుపుదాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారని అధికారులు తెలిపారు.
ఆకస్మిక దాడి జరిగిన ప్రాంతానికి ఆర్మీ బలగాలను పంపినట్లు సమాచారం. కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురికి గాయాలుకాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత నెలలో రాజౌరీలోని కలాకోట్‌లో సైన్యం ప్రత్యేక బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లతో సహా సైనికులు మరణించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో సైన్యంపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10 మంది సైనికులు మరణించారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో 35 మందికి పైగా సైనికులు మరణించారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment