ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో జీవనం సాగిస్తున్న బిచ్చగాళ్లు అయోధ్య రామాలయానికి తమవంతు విరాళాలు అందించారు. సాధారణంగా ఇతరుల ముందు చేతులు చాచే వీరు రామ మందిర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కాశీకి చెందిన యాచకుల సంఘం రామాలయానికి రూ.4.5 లక్షలు విరాళంగా అందించింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)సమర్పణ్ నిధి ప్రచారంలో కాశీకి చెందిన 300 మందికి పైగా యాచకులు పాల్గొన్నారు. గత నవంబర్‌లో కాశీలో భిక్షాటన చేస్తున్న కొందరు వ్యక్తులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి చేరుకుని ఈ ప్రచారంలో తమను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. ఈ నేపధ్యంలో యూపీలోని 27 జిల్లాలకు చెందిన యాచకులు అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం విరాళాలు అందించారు.
ఈ సందర్భంగా కాశీలో భిక్షాటన సాగించే బైద్యనాథ్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం అనారోగ్యం కారణంగా ఏ పనీ చేయలేని స్థితికి చేరుకున్నాని చెప్పాడు. అప్పటి నుంచి భిక్షాటనతో జీవనం సాగిస్తున్నానన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ జరుగున్నదని తెలుసుకుని యాచకులమంతా విరాళాలు సేకరించి అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. తాను జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇదిలా ఉండగా నాలుగు వేల మందికి పైగా చెప్పులు కుట్టేవారు, చాకలివారు, స్వీపర్లు కూడా తమ కష్టార్జితంలోని కొంత భాగాన్ని నూతన రామాలయం కోసం విరాళంగా అందించారు. కాశీ పరిధిలో ఉంటున్న 300 మందికి పైగా యాచకులు రామాలయానికి విరాళాలు అందించారు.
ఇది కూడా చదవండి: రామాలయంలోకి ఇలా వెళ్లి... అలా రావాలి!
Comments
Please login to add a commentAdd a comment