ఢిల్లీ పొల్యూషన్‌.. వరల్డ్‌లోనే టాప్‌ ర్యాంక్‌ ! | Delhi Is Most Polluted Capital In World: Swiss IQAir | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పొల్యూషన్‌.. వరల్డ్‌లోనే టాప్‌ ర్యాంక్‌ !

Published Tue, Mar 19 2024 8:15 AM | Last Updated on Tue, Mar 19 2024 9:09 AM

Delhi Is Most Polluted Capital In World Swiss Iq Air - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్విస్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్ 2023లో వెల్లడించింది. ఈ సర్వేలో 2018 నుంచి వరుసగా నాలుగుసార్లు ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా టాప్‌లో ఉంటూ వస్తోంది. 2022లో ఢిల్లీ పీఎం 2.5 లెవెల్స్‌ క్యూబిక్‌ మీటర్‌కు 89.1 మైక్రో గ్రాములు ఉండగా 2023లో ఇది 92.7 గ్రాములకు చేరింది.

ఇక బీహార్‌లోని బెగుసరాయ్‌ పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణమని ఐక్యూ ఎయిర్‌ తెలిపింది. క్యూబిక్‌ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాముల పీఎం 2.5 కాన్సంట్రేషన్‌తో ప్రపంచంలోనే మూడవ అత్యంత కాలుష్య దేశంగా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల తర్వాత భారత్‌ ఉందని వెల్లడించింది. ఐక్యూ ఎయిర్‌ కాలుష్య దేశాల ర్యాంకుల్లో 2022లో భారత్‌ ర్యాంకు 8గా ఉండగా 2023లో 3వ ర్యాంకుకు ఎగబాకింది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ చదవండి.. వందేళ్ల కక్రితం కరెంట్‌ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement