తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఢిల్లీ ఛలో’ చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చండీగఢ్‌లో గురువారం రోజు వివిధ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. అప్పటి వరకు నిరసనకారులు శాంతియుంతంగా ఉంటారని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నాడు. వివిధ సరిహద్దుల వద్ద పోలీసులు ఏర్పాటు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయరని తెలిపారు.
చండీగఢ్‌లో బుధవారం సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం అనంతరం రైతు నాయకుడు మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్‌లో గురువారం సాయంత్రం 5 గంటలకు నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.కాగా పీయూష్ గోయల్ ఆహారం, పౌర సరఫరాల పంపిణీ మంత్రి పదవిలో ఉండగా.. రాయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. తమపై దాడి చేసింది పోలీసులు కాదని, పారమిలటరీ బలగాలని చెప్పుకొచ్చారు, ఇంత జరిగినా తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు,.
కేంద్రంలో గొడవ పడేందుకు రాలేదు. మాపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించకూడాదని అనుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు సమావేశానికి పిలిచారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మా నుంచి ఎలాంటి చర్య ఉండదు. ప్రధాని మోదీపెద్ద మనసుతో ఎమ్‌ఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలి’ అని పేర్కొన్నారు.
అంతకముందు కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయవద్దని కోరారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment