చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మనం ఏం చేసినా అది మనకు తప్పక తిరిగి వస్తుందని భావిస్తుంటారు. ఎవరికైనా మంచి చేసినా లేదా హాని తలపెట్టినా దాని ఫలితం తప్పక అనుభవిస్తామని గట్టిగా నమ్ముతారు. అచ్చం ఇలాగే కొంత మంది తాము చేసిన ఘనకార్యానికి తక్షణ కర్మను ఎదుర్కొన్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్‌లో మార్చి 28న షేర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇందులో అయిదుగురు వ్యక్తులు దున్నపోతు మీద కూర్చొని రోడ్డు మీద సవారీ చేస్తున్నారు. వీళ్లు రోడ్డుపై బైక్‌పై, గుర్రం మీద వెళుతున్న మరికొంతమందితో పోటీపడి రైడ్ చేస్తున్నారు. పక్కన వెళుతున్న వారు హారన్‌లు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తుండటంతో.. దున్నపోతు కూడా వేగంగా వెళ్లాలని దాని మీద ఉన్న వ్యక్తులు దున్నపోతును రెండు దెబ్బలు వేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది.
చదవండి: భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే..
దెబ్బలు తిన్న దున్నపోతు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కుడివైపుకు తిరిగింది. బండి చక్రాలలో ఒకటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బండి మీదున్న అయిదుగురు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జంతువులను చిత్ర హింసలు పెడితే తగిన శిక్ష అనుభవిస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు ఇది. కర్మ తిరిగి పొందారు’ అని కామెంట్లు చేశారు.
Karma 🙏
— Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022
(Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO
Comments
Please login to add a commentAdd a comment