ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న ఇండిగో విమానం ఏ320-271ఎన్‌లో గాల్లో ఉండగానే.. అందులోని ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లీంచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు. కరాచీ ఎయిర్‌పోర్టు కూడా ఇండిగో విమానం టేకాఫ్‌కు అనుమతించింది. అయితే అప్పటికే సదరు ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని నైజీరియాకి చెందిన 60 ఏళ్ల అబ్ధుల్లాగా అధికారులు గుర్తించారు.
కరాచీలోని సివిల్ ఏవియేషన్ అధికారులు మాట్లాడుతూ..ప్రయాణికుడు విమానంలో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలెట్ మమ్మల్ని అభ్యర్థించాడు. అత్యవసరంగా ల్యాండింగ్ చేసినా.. ఆ ప్రయాణికుడు చనిపోవడంతో మేము చాలా చింతిస్తున్నాం’ అని అన్నారు.
కరాచీలోని అధికారులు అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి, మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. అప్పటి వరకు ఇండిగో విమానం కరాచీలోనే దాదాపు ఐదు గంటల వరకు నిలిపేశారు. ఇదిలా ఉండగా, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ తాజా ప్రకటనలో.. సంబంధిత అధికారుల సమన్వయంతో విమానంలోని ఇతర ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అలాగే ఇండిగో విమానం మృతి చెందిన ప్రయాణికుడితో తిరిగి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపింది.
(చదవండి: టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..)
Comments
Please login to add a commentAdd a comment