కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. టెర్రరిస్టులు లష్కర్ ఎ తొయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
J-K: Five Lashkar terrorists gunned down in ongoing Kulgam encounter
— ANI Digital (@ani_digital) November 17, 2023
Read @ANI Story | https://t.co/6qRrP7HdiL#JammuAndKashmir #Kulgamencounter pic.twitter.com/X0hL5Dkcjg
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కుల్గాంలోని దమ్హాల్ హంజి పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే ముందస్తు సమాచారంతో బలగాలు రెక్కీ నిర్వహించాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిదాడికి దిగిన బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. గత అక్టోబర్‌లోనే కుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
ఇదీ చదవండి: యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ.. మరణశిక్ష అప్పీల్‌ను తోసిపుచ్చిన కోర్టు
Comments
Please login to add a commentAdd a comment