యాసిన్ మాలిక్(కుడి పక్కన)
Terror Funding Case: కశ్మీర్ వేర్పాటువాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. 2017లో కశ్మీర్ అల్లర్లకు సంబంధించి.. వేర్పాటువాద సంస్థలపై టెర్రరిస్టు ఫండింగ్ నేరారోపణలు నమోదు చేయాలని ఆదేశించింది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం Unlawful Activities (Prevention) Act లోని పలు సెక్షన్‌ల కింద నేరారోపణలు నమోదు చేయాలని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాదులతో పాటు పనిలో పనిగా ఉగ్రసంస్థల నేతలకూ షాక్ ఇచ్చింది కోర్టు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్‌తో పాటు హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ పేరును సైతం చేర్చింది. టెర్రర్ ఫండింగ్ కేసులో వీళ్ల పేర్లను పొందుపర్చాలని ఆదేశించింది కోర్టు.
ఈ మేరకు ఢిల్లీ పాటియాలా హౌజ్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పర్వీన్ సింగ్ మార్చి 16వ తేదీనే ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్ర సంస్థలు పక్కా కుట్రతోనే 2017లో కశ్మీర్‌లో అలజడులు సృష్టించారని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. తీవ్రవాద నిధుల కేసులో పలువురు నిందితులు పాకిస్థాన్‌తో ఉమ్మడి ఎజెండాను పంచుకున్నారని పేర్కొన్నారాయన.
మొత్తం పదిహేను మంది కశ్మీరీ వేర్పాటువాద నేతలతో పాటు హఫీజ్ సయ్యద్, సయ్యద్ సలావుద్దీన్, Jammu & Kashmir Liberation Front చీఫ్ యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, ముసారత్ అలమ్‌పై నేరారోపణలు నమోదు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment