ముంబై ఎయిర్‌ పోర్టు, ఇండిగోపై జరిమానా విధింపు | Passengers Eating Food On Tarmac: IndiGo And Mumbai Airport Were Asked To Pay Fine, See Details Inside - Sakshi
Sakshi News home page

ముంబై ఎయిర్‌ పోర్టు, ఇండిగోపై జరిమానా విధింపు

Published Wed, Jan 17 2024 9:48 PM

Passengers Having Food: fine on IndiGo and Mumbai Airport - Sakshi

ముంబై విమానాశ్రయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) రూ.30లక్షలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS)రూ.60లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా ఇండిగో ఎయిర్‌ లైన్స్‌పై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS)రూ.1.20కోట్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)రూ.30లక్షలు మొత్తం 1.50కోట్ల భారీ జరిమానా విధించినట్లు ఒక​ ప్రకటనలో అధికారులు తెలిపారు. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వేపై కూర్చుని భోజనం చేసిన ఘటనపై ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా చేస్తూ.. ఈ జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇటీవల పొగమంచు కారణంగా ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణికులు రన్‌వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్‌మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి విదితమే.

చదవండి:  కాంగ్రెస్‌ గూటికి ఒడిషా మాజీ సీఎం గమాంగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement