మధ్యప్రదేశ్: రాజ్ గడ్ లో జరిగిన కిసాన్ కళ్యాణ మహాకుంభ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అవసరానికి హిందువుగా అవతారం ఎత్తి ఆమె మధ్యప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే ప్రియాంక గాంధీ వచ్చారంటూ వ్యాఖ్యానించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. జబల్పూర్లో రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ సందర్బంగా ఆమె నర్మదా నది వద్ద ప్రార్ధనలు నిర్వహించి ఆ నదిని జీవనదిగానూ, జీవాధారంగానూ వర్ణించడం వెనుక అసలు కారణం వేరే ఉందన్నారు కేంద్ర మంత్రి.
ఈ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రైతుల సాధికారతతోనే దేశం శక్తివంతంగా తయారవుతుందని అన్నారు. కొందరు రైతుని "అన్నదాత" అంటే మరికొంతమంది వారిని "జీవనదాత" అంటూ ఉంటారు. కానీ నా దృష్టిలో రైతులంటే "భాగ్యవిధాతలు" అన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని విమర్శించాడనికి ఆయన ఇదే సభను వేదికగా చేసుకున్నారు. అవసరాన్ని బట్టి హిందువు అవతారం ఎత్తి ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి కొందరు వస్తుంటారు. ఈ మధ్య వారు ఆంజనేయ స్వామి గదను కూడా పట్టుకుని తిరుగుతున్నారు. అలాంటి వారిని నమ్మకండి. నర్మదా నదిని జీవనదిగా ముందు గుర్తించింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజల్లో మంచి నమ్మకాన్ని సంపాదించుకున్నారు.
ఆయన హయాంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ పెరిగింది, అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇక్కడ మహిళలు ఆర్మీలో చేరుతున్నారు, సియాచిన్ నౌకాదళ యుద్ధనౌకల్లో కూడా మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజీపీ ప్రభుత్వాలు అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నాయని, ఇప్పుడు మీరొచ్చి ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాంగ్రెస్ పార్టీ నాయకురాలినుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: మతమార్పిడులు చేస్తే జైలుకే.. ఇద్దరు అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment