సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కాంలో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్‌ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. కాగా, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పిళ్లై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
ఇక, అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఈ స్కామ్‌లో ఇతర విషయాల్లో పిళ్లై కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడించింది. గతేడాది నవంబర్ 11న పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవితకు బదులు భాగస్వామిగా వ్యవహరించినట్లు పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ (ఎల్1) లో యాక్సెస్ వచ్చిందంటూ పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఈడీ ప్రస్తావించింది. కవిత తెలంగాణ సీఎం కూతురని లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రుకు పిళ్లై వివరించినట్లు తెలిపింది.
మరోసారి విందులో పిళ్లై ఫోన్ ద్వారా ‘ఫేస్ టైమ్’లో సమీర్‌ను కవితతో మాట్లాడించినట్లు వివరించింది. ఈ సందర్భంగా కవిత, సమీర్‌ను అభినందించడమే కాకుండా, లిక్కర్ బిజినెస్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపింది. కవిత, అరుణ్ పిళ్లైలు ఆప్ నేత, లిక్కర్ స్కామ్‌లో కీలకమైన విజయ్ నాయర్, దినేశ్ అరోరాలను గతేడాది ఏప్రిల్ 8న ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో కలిసినట్లు పేర్కొంది. 2022లో హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను, సమీర్ కలిశారని, ఈ భేటీలో శరత్ చంద్రా రెడ్డి, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు ప్రస్తావించింది.
ఇది కూడా చదవండి: సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్!
Comments
Please login to add a commentAdd a comment