ప్రతీకాత్మకచిత్రం
బనశంకరి (బెంగళూరు): ఆన్‌లైన్‌లో వైన్ ఆర్డర్ చేసిన యువతి వైన్ అందక, డబ్బులు పోయి బిక్కమొహం వేసింది. ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ కేటుగాళ్లు సుమారు రూ.50 వేలు కాజేశారు. లాల్‌బాగ్‌రోడ్డు అపార్టుమెంట్‌లో నివాసం ఉండే 22 ఏళ్ల యువతి సైబర్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది.
మార్చి 22వ తేదీన ఆమె వైన్‌ను ఇంటికి తెచ్చివ్వాలని ఒక వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసి రూ.540 చెల్లించింది. కొద్దిసేపటికి ఒక ఆగంతకుడు కాల్ చేసి వైన్ ఇవ్వడానికి వస్తున్నాను, డెలివరీ ఫీజు కింద రూ.10 చెల్లించాలని, ఇందుకు మీ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుందని, చెప్పాలని కోరాడు. ఆమె ఓటీపీ చెప్పిన వెంటనే బ్యాంకు అకౌంట్ నుంచి రూ.49,326 నగదు విత్ డ్రా అయ్యింది. పోలీసులు వంచకుల కోసం గాలిస్తున్నారు.
చదవండి: (కోర్టు ఉద్యోగిని ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment