తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్‌షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ‘పాకిస్తాన్ దగ్గర ఆణుబాంబు ఉందని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భయపడుతున్నారు. బాంబ్ ఉందని పీవోకేని పాకిస్తాన్‌కు అప్పగిద్దామా? అని ప్రశ్నించారు. మీరు ఆందోళన చెందొద్దు. మోదీ మరోసారి ప్రధాని కానున్నారు. పాక్‌కు బుల్లెట్లతోనే సమాధానం చెబుతారని అన్నారు.
అంతకుముందు, ప్రధాని మోదీ మణిశంకర్ అయ్యర్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నిరంతరం తన సొంత దేశాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. జాగ్రత్త, పాకిస్థాన్‌లో అణుబాంబులు ఉన్నాయి' అని అంటున్నారు.
ఈ బలహీనులు భారతదేశ స్ఫూర్తిని తగ్గించే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇలాంటి వైఖరిలోనే ఉంది. పాక్ వారి సొంత బాంబులను నిర్వహించలేని స్థితిలో ఉంది. అమ్మడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎవరూ కొనడానికి ఇష్టపడడం లేదు. ఈ బలహీనమైన వైఖరి కారణంగా జమ్మూ కాశ్మీర్‌లోని ప్రజలు ఆరు దశాబ్దాలకు పైగా తీవ్రవాదాన్ని చవిచూడాల్సి వచ్చింది అని ప్రధాని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment