సాక్షి, కాకినాడ: తమపై ఈనాడు దినపత్రిక రాసిన తప్పుడు కథనాలుపై వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు కథనాన్ని ఖండిస్తూ సామర్లకోటలో వలంటీర్లు ఈనాడు పత్రిక కాపీలను దగ్ధం చేశారు. ఈనాడుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వలంటీర్లు అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఏసీ గదుల్లో కూర్చుని.. మాలాంటోళ్ళను రోడ్ల మీదకు తీసుకురావోద్దని మండిపడ్డారు. రామోజీరావుకు దమ్ముంటే ప్రజల మధ్యకు వచ్చి నిజాలు తెలుసుకోవాలన్నారు. మరోసారి తమపై తప్పుడు కథనాలు రాస్తే చెప్పులతో కొడతామని హెచ్చరించారు. కరోనా సమయంలో వాలంటీర్ సేవల ఈనాడుకు కనిపించలేదా? అని ప్రశ్నించారు.
కేవలం ప్రజలకు సేవ చేసేందుకే వాలంటీర్‌గా పని చేస్తున్నామని తెలిపారు. ప్రజల దీవెనలు పొందే గొప్ప అవకాశం సీఎం జగన్ తమకు కల్పించారని అన్నారు. ఒకటవ తేది వస్తే చాలు వాలంటీర్ వచ్చి ఫించన్ ఇస్తుందన్న భరోసా లబ్దిదారుల్లో కలిగుతుందని తెలిపారు. తమ ఉద్యోగం చిన్నదైనా ఇది ఒక స్వచ్ఛంద సేవగా తాము భావిస్తామని తెలిపారు.
రామోజీ రావు క్షమాపణ చెప్పాలి..
శ్రీకాకుళం: ఈనాడు తప్పుడు వార్తలపై వలంటీర్లు మండిపడ్డారు. ఇచ్చాపురంలో వలంటీర్స్ ఆందోళన చెప్పట్టారు. ఈనాడు పత్రికను దగ్ధం చేసి వలంటీర్లు తమ నిరసన తెలిపారు. తక్షణమే రామోజీ రావు క్షమాపణ చెప్పాలని వలంటీర్ల డిమాండ్ చేశారు. ఈనాడు పత్రికపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment