సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌కే ఆధిక్యమంటూ మిషన్ చాణక్య సర్వే రిపోర్టు తేల్చింది. ఓట్ షేర్‌పై మిషన్ చాణక్య నిర్వహించిన సర్వేలో బీఆర్‌ఎస్-44.62 శాతం, కాంగ్రెస్-32.71 శాతం, బీజేపీ-17.6 శాతం, ఇతరులకు 5.04 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.
కాగా, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఇండియా టీవీ సర్వే కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేసిన ఇండియా టీవీ.. బీఆర్ఎస్‌కు 70, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88, కాంగ్రెస్‌కు 19, ఎంఐఎం 7, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు.
చదవండి: తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల
Comments
Please login to add a commentAdd a comment