కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పార్టీ మారబోతున్నారని వర్తాలు వెలువడ్డాయి. ఆయన కాంగ్రెస్‌కు రాజానామా చేసి.. బీజేపీలో చేరుబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ మనీష్ తివారీపై జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆయన ఆఫీసు వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఎంపీ మనీష్ తివారీపై జరుగుతున్న పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించింది. అదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. బీజేపీలో చేరి.. లూథియానా స్థానంలో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది.
‘మనీష్ పార్టీ మారి బీజేపీలో చేరుతారనేది నిరధారమైన విషయం. ఆయన తన నియోజకవర్గంలో పూర్తి దృష్టి పెట్టారు. గత రాత్రి మనీష్ తివారీ తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు’ అని ఎంపీ కార్యాలయం పేర్కొంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్, ఇతర ఎంపీలు కూడా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి.
మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ మీద వచ్చిన ప్రచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఖండించారు. కమల్‌నాథ్‌పై జరుగుతున్న ప్రచారం నిరాధారమైందని స్పష్టం చేశారు. కనీసం కలలో కూడా కమల్‌నాథ్ బీజేపీలో చేరరని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్, తన కొడుకు నకుల్‌తో శనివారం ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీ పార్టీలో చేరటం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ఇక.. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ లోక్‌సభ ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోతుందని రాజకీయా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment