Photo: IPL Website
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అమిత్ మిశ్రా 40 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. ఒక క్రికెటర్‌కు 40 ఏళ్లు వచ్చాయంటే మాములుగా అయితే రిస్క్‌లు చేయడానికి ఇష్టపడడు. కానీ మిశ్రా అలా కాదు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అమిత్ మిశ్రా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన యష్ ఠాకూర్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి థర్డ్‌మన్ దిశగా ఆడాలనుకున్నాడు.
అయితే బంతి ఔట్‌సైడ్ అయి బ్యాట్ ఎడ్జ్ అయి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న అమిత్ మిశ్రా ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మిశ్రా కళ్లు చెదిరే క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ''స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి అని మిశ్రా నిరూపించాడు''.. ''40 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్న మిశ్రాకు హ్యాట్సాఫ్'' అంటూ కామెంట్ చేశారు.
ఇక బౌలింగ్‌లోనూ అమిత్ మిశ్రా మెరిశాడు. తన ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో తన వికెట్ల సంఖ్యను 168కి పెంచుకున్నాడు. మార్క్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అమిత్ మిశ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో 155 మ్యాచ్‌లాడి 168 వికెట్లు తీసుకున్నాడు.
40 Years Old Amit Mishra while making debut for Lucknow & taking this catch means age is just a number for him #LSGvsSRH #MIvsCSK #amitmishra #T20 #IPL #IPL2023 #cricketmatlabMyfab11 #CricketTwitter pic.twitter.com/ZC3dZYh6LP
— raman thind (@thindpau87) April 7, 2023
40 years O̵l̵d̵ young 🙌
— 12th Khiladi (@12th_khiladi) April 7, 2023
Amit Mishra took a brilliant diving catch much to the delight of his teammates.
Also bowled a brilliant spell of 4-0-23-2
📸 : Jio Cinema#LSGvSRH #IPL2023 pic.twitter.com/X8rnIqBTIC
Comments
Please login to add a commentAdd a comment