ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పింది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–12తో మాజీ ప్రపంచ చాంపియన్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలిచింది.
46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ కళ్లు చెదిరే స్మాష్‌లతో, చక్కటి డిఫెన్స్‌తో ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. నేడు జరిగే ఫైనల్లో చోయ్ సోల్ జియు–కిమ్ వన్ హో (దక్షిణ కొరియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది.
తాజా ప్రదర్శనతో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ వచ్చే మంగళవారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్‌సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకునే అవకాశముంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో లేకుండానే సెమీఫైనల్ ఆడిన ప్రణయ్ 16–21, 9–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment