photo credit: IPL Twitter
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వెటరన్ బౌలర్ అమిత్ మిశ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ పడగొట్టడం ద్వారా మిశ్రా ఐపీఎల్ టాప్-3 బౌలర్ల జాబితాలోకి దూసుకొచ్చాడు.
మూడో ప్లేస్‌కు ఎగబాకే క్రమంలో మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. యుజ్వేంద్ర చహల్ (140 మ్యాచ్‌ల్లో 178) రెండో స్థానంలో, అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు) మూడో ప్లేస్‌లో ఉన్నారు.
ఒక్క వికెట్‌తో ముగ్గురిని అధిగమించిన మిశ్రా..
ఐపీఎల్‌లో టాప్-3 బౌలర్ స్థానానికి చేరుకునే క్రమంలో అమిత్ మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు 169 వికెట్లు కలిగిన మిశ్రా.. ఒక్క వికెట్‌తో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 170), ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (173 మ్యాచ్‌ల్లో 170), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (193 మ్యాచ్‌ల్లో 170)లను దాటేశాడు.
మరో వికెట్ కూడా..
ఈ మ్యాచ్‌లో మిశ్రా ఖాతాలో మరో వికెట్ కూడా పడింది. దీంతో అతని వికెట్ల సంఖ్య 172కు చేరింది. రెండో స్థానంలో ఉన్న చహల్‌కు మిశ్రాకు కేవలం 6 వికెట్ల తేడా మాత్రమే ఉంది. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ తర్వాత మిశ్రా.. కీలకమైన డుప్లెసిస్ వికెట్ తీశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 115/6గా ఉంది. దినేశ్ కార్తీక్ (15), హసరంగ (1) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment