సన్‌రైజర్స్ హైదరాబాద్(ఫైల్‌ఫోటో)
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వ్యూహత్మకంగా వ్యవహరించింది. వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, వరల్డ్‌కప్ హీరో ట్రావిస్ హెడ్, శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.
వీరి ముగ్గురి రాకతో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఇప్పుడు మరింత పటిష్టంగా కన్పిస్తోంది. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
వేలంలో రూ.20.50 కోట్టు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ప్యాట్ కమ్మిన్స్‌కు తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్‌ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఐడైన్ మార్‌క్రమ్‌ను తప్పించాలని ఎస్‌ఆర్‌హెచ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కెప్టెన్‌గా కమ్మిన్స్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా సారథ్య మార్పు కోసం సన్‌రైజర్స్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాగా కమ్మిన్స్ సారథ్యంలోనే వన్డే ప్రపంచకప్‌ను, వరల్డ్‌టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్‌ను ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా గత మూడు సీజన్ల నుంచి ఎస్‌ఆర్‌హెచ్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. కెప్టెన్లు, కోచ్‌లను మార్చినప్పటికి ఫలితం మాత్రం శూన్యమే. కమ్మిన్స్, హెడ్ రాకతోనైనా ఎస్‌ఆర్‌హెచ్ తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి.
ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ జట్టు:
అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు
రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు
ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు (కెప్టెన్)
గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు
హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు
మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు
ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు
అన్మోల్‌ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు
ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు
షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు
నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు
అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు
మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు
వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు
సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు
భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు
టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు
వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు
మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు
ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు
ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు
జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు
ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు
ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment